వంశీ-శుభోదయం పురస్కారాలు..

- June 28, 2022 , by Maagulf
వంశీ-శుభోదయం పురస్కారాలు..

హైదరాబాద్: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న వంశీ ఆర్ట్ థియేటర్స్, శ్రీ త్యాగరాయ గాన సభ- శుభోదయం సంయుక్త ఆధ్వర్యంలో కళాసుబ్బారావు కళా వేదిక, శ్రీ త్యాగరాయ గాన సభ, చిక్కడపల్లి, హైదరాబాద్ నందు, తెలంగాణ ప్రభుత్వాధికార ప్రతినిధి, న్యూఢిల్లీ, డాక్టర్ వేణుగోపాలాచారి వంశీ శుభోదయం పురస్కారాలను ప్రధానం చేశారు.

వంశీ శుభోదయం తెలుగు తేజం ప్రవాస భారతీయ పురస్కారాలు మల్లికేశ్వరరావు కొంచాడ, సంపాదకులు, తెలుగు మల్లి, మెల్బోర్న్ ఆస్ట్రేలియా మరియు రాజేష్ యక్కలి, సీఈఓ, స్వర మీడియా, అమెరికా అందుకున్నారు.

వంశీ శుభోదయం సంగీత పురస్కారాలు ప్రముఖ సంగీత విద్వాంసులు, అసిస్టెంట్ డైరెక్టర్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ చౌటి రఘునందన్,వంశీ-శుభోదయం ఆధ్యాత్మిక పురస్కారం కంచర్ల గోపన్న వారసులు కంచర్ల వెంకట రమణ, వంశీ శుభోదయం సాహితీ పురస్కారం శ్రీనాధ కవి వారసులు డా.కావూరు శ్రీనివాస్అందుకున్నారు.

ప్రముఖ సంగీత విద్వాంసురాలు అంగర లక్ష్మి గారి దివ్య స్మృతిలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత విద్వాంసులు చౌటి రఘునందన్ కర్ణాటక సంగీత గాత్ర కచేరి సమర్పించారు.. మృదంగం పై భీమశంకర్, అసిస్టెంట్ లెక్చరర్, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్,కీ బోర్డుపై  శ్రీనివాస్ యాదవ్,తబలా పై జయ కుమార్ ఆచారి సహకరించారు..
 
ఈ కార్యక్రమానికి వంశీ వ్యవస్థాపకులు శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు అధ్యక్షులుగా వ్యవహరించారు.వ్యాఖ్యాత్రిగా షామీర్ జానకీదేవి, ప్రత్యేక అతిథిగా అంగర లక్ష్మీ కుమార్తె ఉషశ్రీ, వంశీ మేనేజింగ్ ట్రస్టీ, సుంకరపల్లి శైలజ పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com