తెలంగాణ కరోనా అప్డేట్

- June 28, 2022 , by Maagulf
తెలంగాణ కరోనా అప్డేట్

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ మమహ్మరి డేంజర్ బెల్స్ మోగిస్తోంది.వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.తెలంగాణలో వరుసగా 8వ రోజు 400కిపైగా కొవిడ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది.మంగళవారం(జూన్ 21) రాష్ట్రంలో 403 కేసులు, బుధవారం(జూన్ 22) 434 కేసులు, గురువారం(జూన్ 23) 494 కేసులు, శుక్రవారం(జూన్ 24) 493 కేసులు, శనివారం(జూన్ 25) 496 కేసులు, ఆదివారం(జూన్ 26) 434 కేసులు, సోమవారం(జూన్ 27) 477 కేసులు నమోదు కాగా.. తాజాగా ఆ సంఖ్య 459గా ఉంది.

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 26వేల 126 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 459 మందికి పాజిటివ్ గా తేలింది. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 232 కొత్త కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 60, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 28 కేసులు, సంగారెడ్డిలో 54 కేసులు, ఖమ్మంలో 6 కేసులు గుర్తించారు. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 247 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.

రాష్ట్రంలో నేటివరకు 7లక్షల 99వేల 991 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 7లక్షల 91వేల 708 మంది కోలుకున్నారు. క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో.. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్యా పెరుగుతోంది. రాష్ట్రంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 4వేల మార్క్ ను తాకడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4వేల 172కి పెరిగింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111.ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 25వేల 989 కరోనా టెస్టులు చేయగా.. 477 కేసులు వచ్చాయి.

కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రజలకు జాగ్రత్తలు చెప్పింది. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. చేతులను తరుచుగా శుభ్రంగా కడుక్కోవాలంది. అనవసర ప్రయాణాలు చేయొద్దని సూచించింది. పెద్దలు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com