ఉపరాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల
- June 29, 2022
న్యూ ఢిల్లీ: 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. జులై 5న నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు చెప్పింది. ఆ రోజు నుంచే ప్రారంభంకానున్న నామినేషన్ల దాఖలు ప్రక్రియ జులై 19తో ముగియనుంది. 20న అధికారులు వాటిని పరిశీలించనున్నారు. 22వ తేదీ వరకు నామినేషన్ల విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. ఒకరికి మించి అభ్యర్థులు పోటీలో ఉంటే ఆగస్టు 6న ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది. కొత్త వైస్ ప్రెసిడెంట్ ఆగస్టు 11న ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఉపరాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకోనుంది. 233మంది రాజ్యసభ సభ్యులతో పాటు 12మంది నామినేటెడ్ సభ్యులు, 543మంది లోక్సభ ఎంపీలతో కలుపుకొని మొత్తం 788మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.
తాజా వార్తలు
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?