తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వలసదారుడు స్వదేశానికి పయనం

- June 29, 2022 , by Maagulf
తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వలసదారుడు స్వదేశానికి పయనం

బహ్రెయిన్: 62 ఏళ్ళ వలస మహిళ, తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు. ఆమె ఓ వారం రోజుల్లో స్వదేశానికి పయనమవనున్నారు. రాధికా బైగనాథ్ అనే మహిళ ఏడాదిన్నరగా మంచానికే పరిమితయ్యారు అనారోగ్యం కారణంగా. ఆమె తన వైద్య చికిత్సను భారతదేశంలో కొనసాగించుకోనున్నారు. ఆమెకు 66 ఏళ్ళ భర్త మంగళ్ నంద్ కిషోర్, 11 ఏళ్ళ తనయుడు ప్రిన్స్ కుమార్ వున్నారు. రెండేళ్ళ క్రితం రాధికకు స్ట్రోక్ వచ్చింది. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం విషమించింది. సల్మానియా మెడికల్ కాంప్లెక్సులో ఆమె వైద్య చికిత్స పొందుతున్నారు. సోషల్ వర్కర్ సుధీర్ తిరునిలాత్ తమకు సహకరించారని, సబు చిరామెల్ ఆఫ్ హోప్ బ్రహెయిన్ కూడా సాయం అందించిందనీ, స్వదేశానికి వెళ్ళబోతున్నామని రాధిక కుటుంబ సభ్యులు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com