పీఎస్ఎల్వీ సీ53 రాకెట్ ప్రయోగం విజయవంతం
- June 30, 2022
పీఎస్ఎల్వీ-సీ53 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి గురువారం సాయంత్రం 6.02గంటలకు పీఎస్ఎల్వీ-సీ53 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. కౌంట్ డౌన్ 26గంటల పాటు కొనసాగిన తర్వాత రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
న్యూస్పేస్ ఇండియా వాణిజ్యపరమైన రెండో మిషన్ ఇది. సింగపూర్ ఉపగ్రహాలను పీఎస్ ఎల్వీ- సీ53 కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన డీఎస్–ఈఓ అనే 365 కేజీల ఉపగ్రహం, 155 కేజీల న్యూసార్, 2.8 కేజీల స్కూబ్–1 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 55వ ప్రయోగం.
ఇస్రో వాణిజ్య పరంగా పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా 33 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. 2016లో పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను పంపి చరిత్ర సృష్టించారు. వాణిజ్యపరంగా తక్కువ ఖర్చుతో విదేశీ ఉపగ్రహాలను పంపించే వెసులుబాటు వుండడంతో చాలా దేశాలు భారత్ నుంచే ప్రయోగాలకు మొగ్గుచూపుతున్నాయి.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







