శ్రీవారి భక్తులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త
- July 01, 2022
హైదరాబాద్: తెలంగాణ నుంచి తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. తిరుపతి వెళ్లే బస్ టికెట్‌తోపాటే దర్శన టికెట్‌ను కూడా బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానంతో ఒప్పందం కుదుర్చుకుంది. నేటి నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
ప్రతి రోజూ వెయ్యి టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. తిరుమలకు బస్ టికెట్లు బుక్ చేసుకునే సమయంలోనే దర్శన టికెట్లు కూడా బుక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. ఆర్టీసీ వెబ్‌సైట్ ద్వారా కానీ, లేదంటే అధీకృత డీలర్ వద్ద నుంచి కానీ టికెట్లు బుక్ చేసుకోవచ్చన్న సజ్జనార్ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆన్‌లైన్ లేదా టికెట్ బుకింగ్ కౌంటర్లలో ప్యాకేజీ కోసం కనీసం వారం ముందుగా టికెట్లు బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్‌లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం