ఏప్రిల్‌ 14న 'సుప్రీమ్' ఆడియో విడుదల

- April 11, 2016 , by Maagulf
ఏప్రిల్‌ 14న 'సుప్రీమ్' ఆడియో విడుదల

సాయిధరమ్‌తేజ్‌, రాశీఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం 'సుప్రీమ్‌'. ఈ చిత్రం ఆడియో విడుదల వేడుకను ఏప్రిల్‌ 14న నిర్వహించనున్నట్లు కథానాయకుడు సాయిధరమ్‌తేజ్‌ సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా అభిమానులతో సరికొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ వేసవిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు పోస్టర్లో పేర్కొన్నారు.అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్‌ సంగీతం సమకూరుస్తున్నారు. రవి కిషన్‌, సాయి కుమార్‌, శ్రీనివాసరెడ్డి, పోసాని కృష్ణమురళి, జయప్రకాశ్‌ రెడ్డి తదితరులు చిత్రంతో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com