కలర్స్ స్వాతి రీ ఎంట్రీ: ప్రయోగం ఫలిస్తుందా.?
- July 06, 2022
‘కలర్స్’ అనే ప్రోగ్రామ్ ద్వారా బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న ముద్దుగుమ్మ స్వాతి. ఆ ప్రోగ్రామ్ పేరే ఆమె ఇంటి పేరుగా ఫేమస్ అయిపోయిందీ అమ్మడు. ఆ తర్వాత అదే పేరుతో, సినిమాల్లోకి తెరంగేట్రం చేసింది. ‘అష్టా చెమ్మా’ సినిమాతో హీరోయిన్గా డెబ్యూ చేసింది.
ఆ తర్వాత ‘స్వామి రారా’,‘కార్తికేయ’ తదితర విజయవంతమైన చిత్రాలతో ఆకట్టుకుంది.పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిలైపోయిన కలర్స్ స్వాతి, ఆ తర్వాత సినిమాల్లో కనిపించలేదు.ఈ మధ్యనే మళ్లీ కలర్స్ స్వాతి రీ ఎంట్రీపై ప్రచారం జరుగుతోంది.
అందులో భాగంగా, ‘కార్తికేయ’ సినిమాకి సీక్వెల్‌గా రూపొందుతోన్న ‘కార్తికేయ 2’ సినిమాలో కలర్స్ స్వాతి గెస్ట్ రోల్ పోషిస్తోందని అంటున్నారు. అయితే ఆ విషయంలో అధికారిక ప్రకటన లేదు కానీ, కలర్స్ స్వాతి సెకండ్ ఇన్నింగ్స్ అయితే, కన్ఫామ్ అయిపోయింది.
గెస్ట్‌గా కాదు, హీరోయిన్‌గానే కూడా. ‘మంత్ ఆఫ్ మధు’ అనే ఓ ప్రయోగాత్మక చిత్రంతో కలర్స్ స్వాతి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తోంది. లేటెస్టుగా ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది. సమ్‌థింగ్ డిఫరెంట్ వేలో కనిపిస్తోంది ఈ ఫస్ట్ లుక్ పోస్టర్.
సో, ఈ డిఫరెంట్ కథా చిత్రంతోనే కలర్స్ స్వాతి సెకండ్ ఇన్నింగ్స్ షురూ అవుతోందన్న మాట. ఈ సినిమాలో నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్నాడు.
తాజా వార్తలు
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం







