అంతర్జాతీయ భారత మహిళ అవార్డు ఐశ్వర్యరాయ్‌కి..

- April 12, 2016 , by Maagulf
అంతర్జాతీయ భారత మహిళ అవార్డు ఐశ్వర్యరాయ్‌కి..

 పనామా పేపర్స్ వివాదంలో చిక్కుకుని సతమతమవుతున్న తరుణంలో బాలీవుడ్ అందాల నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్‌కు ఇది సంతోషకరమైన వార్త. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ భారత మహిళ అవార్డు లభించింది. ముంబాయ్‌లో జరిగిన ప్రవాసీ భారతీయుల అవార్డు ఫంక్షన్‌లో పాల్గొన్న ఐష్ 'గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్' అవార్డు అందుకున్నారు. అయితే ఈ అవార్డును తన కూతురు ఆరాధ్యకు అంకితం చేసింది 42 సంవత్సరాల ఐశ్వర్య. ఐష్‌తో పాటు ప్రముఖ టన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా కూడా ప్రత్యేక అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును అంతర్జాతీయ వేదికపై భారతీయ మహిళ ఉన్నతిని పెంచేందుకు లభించిన అవకాశంగా భావిస్తున్నట్టు తెలిపింది ఐష్. మొదటి నుంచి కూడా తనకు లభించిన ప్రతి అవకాశాన్ని అలానే ఉపయోగించిన తనకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, సామాజిక గుర్తింపుతో పాటు పలు అవకాశాలు లభించాయని గుర్తు చేసుకున్నారామె. ఈ ప్రవాసీ భారతీయ అవార్డుల ప్రధానోత్సవంలో మొత్తం 17 మంది వ్యక్తిగతంగా అవార్డులు స్వీకరించారు. అందులో వృత్తి, కళ, సంప్రదాయం, స్పెషల్ జ్యూరీ, గ్లోబల్ ఐకాన్, వ్యాపారం ఇలా పలు అంశాల వారీగా అవార్డులు ఇవ్వబడ్డాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com