ముహరక్ లో తనిఖీలు నిర్వహించిన LMRA

- July 18, 2022 , by Maagulf
ముహరక్ లో తనిఖీలు నిర్వహించిన LMRA

మనామా: విదేశాల నుండి అక్రమంగా ప్రవేశించి ఉపాధి పొందుతున్న వారిని గుర్తించేందుకు జాతీయ పాస్ పోర్ట్ జారీ , అంతర్గత మంత్రిత్వశాఖ మరియు  దక్షిణ ప్రావిన్స్ అధికారుల సహకారంతో దేశ కార్మిక మార్కెట్ నియంత్రణ మండలి (LMRA) మూహరక్ ప్రావిన్స్ లోని పలు ఉద్యోగ కేంద్రాల్లో  తనిఖీలు నిర్వహించడం జరిగింది. 

దేశ కార్మిక చట్టం యొక్క నియమ నిబంధనలు పాటించని సంస్థల్లో ఎక్కువగా అక్రమ విదేశీ కార్మికులు ఉన్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ దేశ ప్రజలకు ఉపాధి అవకాశాలు నష్టం చేకూర్చే విధంగా ఎవరు ప్రయత్నించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com