అవునా.! నిజమా.! ఆ సీనియర్ జంట విడిపోనుందా.?

- July 20, 2022 , by Maagulf
అవునా.! నిజమా.! ఆ సీనియర్ జంట విడిపోనుందా.?

రమ్యకృష్ణ, కృష్ణవంశీ దంపతుల గురించి తెలిసిందే. ‘చంద్రలేఖ’ సినిమా టైమ్‌లో వీరిద్దరి మధ్యా లవ్వు చిగురించి పెళ్లి పీటల వరకూ చేరింది. అలా ఆ జంట వైవాహిక జీవితం మూడు పువ్వులూ ఆరు కాయల్లా సాగుతోంది. ఓ పక్క వ్యక్తిగత జీవితాన్నీ, మరో పక్క కెరీర్‌ని కూడా బాగా బిల్డప్ చేసుకుంటూ ఆదర్శవంతమైన జంటగా పేరు తెచ్చుకున్నారు.

అయితే, ఈ జంటపై ఎవరికో కన్ను కుట్టింది. ఇన్నేళ్ల తర్వాత రూమర్స్ క్రియేట్ చేశారు. ఇంకేముంది.. కృష్ణ వంశీ, రమ్యకృష్ణ విడాకులు తీసుకుంటున్నారట.. అంటూ ప్రచారం లేవనెత్తారు. ఇదో ట్రెండ్ అయిపోయింది కదా ఈ మధ్య.

ఈ ట్రెండ్‌ని ఈ జంటకీ ఆపాదించేశారు. అయితే, కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రంగ మార్తాండ’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో ఆయన జోరుగా పాల్గొంటూ ఆసక్తికరమైన అంశాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. ఆ క్రమంలోనే ఆయన డైవోర్స్ న్యూస్ ఆయన టేబుల్ వద్దకు వచ్చింది. ఆ న్యూస్‌ని ఖండిస్తూ, రమ్యకృష్ణకీ నాకూ ఎలాంటి బేధాభిప్రాయాలూ లేవు. రావు కూడా అన్నారాయన.

నాకసలు పెళ్లి మీదే మంచి అభిప్రాయం లేదు.. అందుకే జీవితంలో పెళ్లి చేసుకోకూడదనుకున్నా.. కానీ, రమ్యకృష్ణ‌ను పెళ్లి చేసుకున్నా నా అభిప్రాయం మార్చుకున్నా.. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ మా మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలూ రాలేదు.. చాలా సాఫీగా సాగిపోతోంది మా జీవితం. అలాంటి మేము ఎందుకు విడిపోతాం.?’ అని ఆయన ఎదురు ప్రశ్నించారు. దాంతో ఈ ప్రచారానికీ కత్తెర పడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com