బన్నీ, వేణు శ్రీరామ్‌కి అందుకే నో చెప్పాడా.!
- July 20, 2022
అల్లు అర్జున్, వేణు శ్రీరామ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కాల్సి వుంది. ‘ఐకాన్’ అనే టైటిల్‌తో ఈ సినిమాని అనౌన్స్ చేశారు. అయితే, ఆ సినిమా చేయకుండానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అయిపోయాడనుకోండి. అది వేరే చర్చ.
అయితే, అనౌన్స్ చేసి ఇన్నాళ్లయినా ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ అయ్యాకే, వేణు శ్రీరామ్, పవన్ కల్యాణ్‌తో ‘వకీల్ సాబ్’ సినిమాని తెరకెక్కించేశాడు. ఆ సినిమా వచ్చి కూడా చాలా కాలమే అయిపోతోంది. కానీ, బన్నీ సినిమా విషయమై ఎలాంటి అప్‌డేట్ లేదింత వరకూ.
దీని వెనక వున్న సీక్రెట్ ఏంటో తెలిసిపోయింది. బన్నీ ఈ సినిమాని క్యాన్సిల్ చేసుకున్నాడట. స్ర్కిప్ట్ నెరేషన్‌లో కొన్ని కొన్ని మార్పులు సూచించాడట బన్నీ. అందుకు వేణు శ్రీరామ్ నో చెప్పాడట. దాంతో ఈ సినిమా అటకెక్కేసిందని తెలుస్తోంది.
అయితే, కాంబినేషనే మిస్ అయ్యింది. స్క్రిప్ట్ మాత్రం అలాగే వుందట. అదే స్క్రిప్టుతో ఇప్పుడు వేణు శ్రీరామ్, రామ్ పోతినేని హీరోగా సినిమా రూపొందించబోతున్నాడట. రామ్‌తో ఈ సినిమా తీసి హిట్ కొట్టాలన్న కసితో వున్నాడట.
మరో విషయమేంటంటే, రామ్ నటించిన తాజా చిత్రం ‘ది వారియర్’ స్ర్కిప్టు కూడా మొదట బన్నీ దగ్గరికి వెళ్లిందేనట. బన్నీ నో చెప్పగా, రామ్ వద్దకు వచ్చిందట. అదీ సంగతి.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







