చైతూ విషయంలో అమీర్ ఖాన్ ఎంత గొప్పవాడో తెలుసా.?
- July 20, 2022
అక్కినేని హీరో నాగ చైతన్య, బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. అదే ‘లాల్ సింగ్ చద్దా’. ఈ సినిమాతోనే నాగ చైతన్య బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నాడు.
చైతూ మంచి నటుడు.. అనీ, పర్సనల్‌గా చాలా మంచి వ్యక్తి అనీ.. మొన్నా మధ్య అమీర్ ఖాన్ చెప్పాడు. తాజాగా అమీర్ ఖాన్‌ని మునగ చెట్టు ఎక్కించే పనిలో వున్నాడు నాగ చైతన్య.
‘లాల్ సింగ్ చద్దా’ సినిమా షూట్ సమయంలో అమీర్ ఖాన్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాడట చైతూ. ఎన్నో జీవిత సత్యాలు ఆయన నుంచి నేర్చుకున్నాననీ చైతూ చెప్పడం విశేషం. ఇదే విషయమై చైతూపై ట్రోల్స్ జరుగుతున్నాయ్ నెట్టింట్లో.
ఎందుకంటే, చైతూ, సామ్ విడిపోవడానికి అమీర్ ఖాన్ ఓ కారణంగా చెబుతుంటారు. అది ఇంతవరకూ కేవలం రూమర్‌గానే భావించారు. కానీ, తాజాగా తేజు, అమీర్ ఖాన్ గురించి చెబుతున్న మాటలు వింటుంటే, రూమర్స్ నిజమే అనిపిస్తోందంటున్నారు నెటిజనం.
మరోవైపు, చైతూ నటించిన ‘థాంక్యూ’ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్‌గా నటించింది. డిఫరెంట్ లవ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు బాగా వున్నాయ్.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..