భారతీయులకు ఇండియన్ ఎంబసీ కీలక సూచన

- July 20, 2022 , by Maagulf
భారతీయులకు ఇండియన్ ఎంబసీ కీలక సూచన

న్యూ ఢిల్లీ: ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంక అల్లాడుతోంది.ఈ నేపథ్యంలోనే కొలంబో సమీపంలో గత రాత్రి అనూహ్య దాడి జరిగింది.ఈ దాడిలో భారత ప్రభుత్వాధికారి గాయపడ్డారు. ఈ విషయాన్ని శ్రీలంలోని భారత రాయబార కార్యాలయం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అంతేకాకుండా భారతీయులకు పలు సూచనలు చేసింది.దాడిలో గాయపడిన ఇండియన్ వీసా సెంటర్ డైరెక్టర్ వివేక్ వర్మను పరామర్శించినట్టు ట్విట్టర్ ద్వారా పేర్కొన్న ఇండియన్ ఎంబసీ.. గత రాత్రి కొలంబో సమీపంలో ఈ ఘటన జరిగినట్టు వెల్లడించింది.ఈ ఘటన గురించి శ్రీలంక అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పింది.లంకలో తాజా పరిణామాల పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ రాకపోకలు సాగించాలని అక్కడి భారత పౌరులకు సూచించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com