మధ్యాహ్నం పనిపై నిషేధాన్ని ఉల్లంఘించిన 26 మంది కార్మికులు అరెస్టు

- July 21, 2022 , by Maagulf
మధ్యాహ్నం పనిపై నిషేధాన్ని ఉల్లంఘించిన 26 మంది కార్మికులు అరెస్టు

కువైట్: అన్ని గవర్నరేట్‌లలో బహిరంగ ప్రదేశాలలో మధ్యాహ్న పని నిషేధం అమలును పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ తనిఖీ బృందాలు పర్యవేక్షించాయి. ఈ నెల 3 నుంచి 16వ తేదీ వరకు 25 కంపెనీలకు చెందిన 23 సైట్లలో పదే పదే ఉల్లంఘనలకు పాల్పడిన 26 మంది కార్మికులను అరెస్టు చేశారు. కార్మికుల భద్రతను కాపాడేందుకు వ్యాపార యజమానులు మధ్యాహ్న పని నిషేధానికి కట్టుబడి ఉండాలని అధికార యంత్రాంగం పిలుపునిచ్చింది. కాగా, గత సంవత్సరాలతో పోల్చితే ఉల్లంఘనల సంఖ్యలో తగ్గుదల నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com