నవరస నటనా సార్వభౌమ
- July 25, 2022విలక్షణమైన నటులకు పెట్టింది పేరు తెలుగు చలచిత్ర పరిశ్రమ, నాటి నుండి నేటి వరకు ఎందరో తమదైన నటనా శైలితో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. అటువంటి వారిలో ముఖ్యులు కైకాల సత్యనారాయణ ఒకరు. నేడు ఆయన 87 వ జన్మదినం సందర్భంగా ఆయన జీవిత ప్రయాణం గురించి మీకోసం.
కళలకు పుట్టినిల్లు అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు కృష్ణా జిల్లా. ఈ జిల్లా నుండి ఎందరో ప్రముఖులు వెండితెరను ఏలారు. అటువంటి కృష్ణా జిల్లా లోని గుడివాడ దగ్గర్లోని కౌతవరం అనే కుగ్రామంలో జన్మించారు కైకాల సత్యనారాయణ.
విద్యార్థి దశలోనే నటన పట్ల ఆకర్షితుడై పలు నాటకాల్లో నటించారు. ఉన్నత విద్యను పూర్తి చేసిన తర్వాత నటన పట్ల ఉన్న మక్కువతో అవకాశాలు కోసం మద్రాస్ వెళ్లి చిన్న చిన్న వేషాలతో మొదలై క్రమంగా తన దైన నటనా శైలితో ప్రేక్షకులను అలరించారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అంచెలంచెలుగా ఎదుగుతూ విభిన్నమైన పాత్రలను పోషించి మెప్పించిన సత్యనారాయణ గారు ఆనాటి అగ్రశ్రేణి నటుల కంటే ఎక్కువ పారితోషికం సైతం అందుకున్నారు.
హీరోతో సమానంగా పాత్రలు పోషించిన సత్యనారాయణ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు మంచి గుర్తింపు రావడంలో కీలకమైన పాత్ర పోషించారు.
సత్యనారాయణ గారు నటుడిగానే కాకుండా రాజకీయాల్లో సైతం రాణించారు.నటుడు ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి 1996 లో మచిలీపట్నం నుండి లోక్ సభ కు ఎన్నికయ్యారు.
సుమారు 6 దశాబ్దాల సినీ ప్రయాణంలో పరిశ్రమలోని అన్ని వర్గాల వారికి కావాల్సిన వ్యక్తిగా, అజాత శత్రువుగా నిలిచిన సత్యనారాయణ గారు మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలి.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?