అబ్దుల్లా అల్-ముబారక్‌ను సందర్శించిన నూన్ వర్క్ బ్యాన్ టీమ్

- July 28, 2022 , by Maagulf
అబ్దుల్లా అల్-ముబారక్‌ను సందర్శించిన నూన్ వర్క్ బ్యాన్ టీమ్

కువైట్: దక్షిణ సబర్బ్ అబ్దుల్లా అల్-ముబారక్ ను నూన్ వర్క్ బ్యాన్ టీమ్ హెడ్, జహ్రా గవర్నరేట్‌లోని ఆక్యుపేషనల్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ హెడ్ హమద్ అల్-మఖిల్ సందర్శించారు. ఈ సందర్భంగా హమద్ అల్-మఖిల్ మాట్లాడుతూ.. 10 కంటే ఎక్కువ ప్లాట్లు, 300 కంటే ఎక్కువ కంపెనీలు సందర్శించి నూన్ వర్క్ చట్టం గురించి అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. కార్మికులు, కంపెనీలు చట్టాలకు కట్టుబడి ఉండేలా చూసేందుకు నిబంధనలు ఉల్లంఘించిన సైట్‌లను 48 గంటల తర్వాత మరోసారి తనిఖీ చేసినట్లు తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించడం కొనసాగించినట్లయితే కంపెనీ ప్రతి కార్మికుడికి 100 నుండి 200 దీనార్ల వరకు జరిమానా చెల్లించవలసి ఉంటుందని, న్యాయ వ్యవహారాల విభాగానికి ఫైల్ పంపిస్తామని, కంపెనీని 'బ్లాక్' జాబితాలో చేర్చే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎండాకాలంలో కార్మికులు ఉదయం 11 నుండి 4 గంటల వరకు పని చేయకుండా నూన్ వర్క్ చట్టం రక్షణ కల్పిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com