నూన్ వర్క్ చట్టం.. అమలును పరిశీలించిన కార్మిక శాఖ మంత్రి
- July 29, 2022
మనామా: 2013 నాటి మినిస్టీరియల్ ఎడిట్ (3)ని ప్రయివేటు రంగ సంస్థలు పాటిస్తున్నాయా లేదా పరిశీలించేందుకు కార్మిక మంత్రి జమీల్ బిన్ మొహమ్మద్ అలీ హుమైదాన్ ఆకస్మిక క్షేత్ర పర్యటన నిర్వహించారు. జూలై, ఆగస్టు నెలల్లో అమలు చేస్తున్న నూన్ వర్క్ నిషేధం అమలును ఈ సందర్భంగా పరిశీలించారు. మంత్రి వర్క్‌సైట్‌ల దగ్గర సూపర్‌వైజర్‌లతో సమావేశమయ్యారు. కార్మికుల ఆరోగ్యం, భద్రతను పరిరక్షించడం, వృత్తిపరమైన ప్రమాదాలను తగ్గించడం లక్ష్యంగా రెండు నెలల నిషేధానికి పూర్తిగా కట్టుబడి ఉండేలా ఆయా కంపెనీలు తీసుకున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. జూలై 1న నూన్ వర్క్ నిషేధ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుండి మంత్రిత్వ శాఖ 6608 తనిఖీలను నిర్వహించింది. మొత్తం 16 సంస్థలు, 27 మంది కార్మికులు నిషేధాన్ని ఉల్లంఘించినట్లు గుర్తించారు. 2012 చట్టం 36 ప్రకారం.. రెండు నెలల నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి మూడు నెలల వరకు జైలు శిక్షతోపాటు BD1000 వరకు జరిమానా విధించబడుతుంది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







