డెలివరీ రైడర్‌ను ప్రశంసించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్
- August 01, 2022
దుబాయ్: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ ఆదివారం డెలివరీ రైడర్ అయిన పాకిస్తాన్ ప్రవాస అబ్దుల్ గఫూర్ అబ్దుల్ హకీమ్‌ను ప్రశసించారు. త్వరలోనే వ్యక్తిగతంగా కలుస్తానని క్రౌన్ ప్రిన్స్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. తలాబత్ డెలివరీ రైడర్ అయిన అబ్దుల్ గఫూర్.. రద్దీగా ఉండే ట్రాఫిక్ జంక్షన్ నుండి వెళ్లే క్రమంలో రోడ్డపై పడిపోయిన రెండు కాంక్రీట్ ఇటుకలను గుర్తించాడు. వాటి కారణంగా వాహనాలకు ప్రమాదం ఏర్పడుతుందని గ్రహించి.. బైక్ ను ఆపి పరిగెత్తి వాటిని తొలగించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వైరల్ వీడియో షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ దృష్టిని ఆకర్షించింది. షేక్ హమ్దాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రైడర్ ఆలోచనను ప్రశంసిస్తూ ఒక కథనాన్ని పోస్ట్ చేశాడు. దీనిపై అబ్దుల్ గఫూర్ స్పందిస్తూ.. షేక్ హమ్దాన్ నుంచి తనకు కాల్ వచ్చినప్పుడు డెలివరీ కోసం బయట ఉన్నట్లు తెలిపారు. “నేను చేసిన పనికి దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ నాకు కృతజ్ఞతలు తెలిపారు. అతను ప్రస్తుతం దేశం వెలుపల ఉన్నాడని.. తిరిగి వచ్చిన వెంటనే నన్ను కలుస్తానని హామీ ఇచ్చాడు.’’ అని అబ్దుల్ గఫూర్ సంతోషం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!