ఖతార్ 2022 ఫిఫా ప్రపంచ కప్.. టిక్కెట్లను గెలుచుకోండిలా
- August 08, 2022
దోహా: ప్రపంచ కప్ 2022కి 100 రోజుల కౌంట్‌డౌన్‌లో భాగంగా.. సుప్రీమ్ కమిటీ ఫర్ డెలివరీ అండ్ లెగసీ (SC) అభిమానులకు అల్ బైట్ స్టేడియంలో ప్రారంభ మ్యాచ్‌కు టిక్కెట్లను గెలుచుకునే అవకాశాన్ని అందిస్తోంది. ఖతార్‌లోని అభిమానులు ఆగస్టు 11-13 వరకు జరిగే వేడుకల్లో పాల్గొనవచ్చని, దీని కోసం అల్ బైట్ స్టేడియంలో జరిగే ప్రారంభ మ్యాచ్(ఖతార్ vs ఈక్వెడార్)కు కేటగిరీ 1 టిక్కెట్లను గెలుచుకునే అవకాశం కల్పించినట్లు పేర్కొంది. దేశంలోని వివిధ మాల్స్‌లో వేడుకలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు. ఇందులో సరదా ఆటలు, ప్రదర్శనలు ఉంటాయని, అదే సమయంలో అభిమానులకు వారి ఫుట్‌బాల్ నైపుణ్యాలను పరీక్షించే అవకాశం కూడా ఉందని పేర్కొంది. దోహా ఫెస్టివల్ సిటీలో ఆగస్టు 11-13 నుండి మధ్యాహ్నం 1 నుండి రాత్రి 10 గంటల వరకు, ప్లేస్ వెండోమ్ అదే రోజులలో మధ్యాహ్నం నుండి రాత్రి 10 గంటల వరకు వేడుకలు ఉంటాయని తెలిపింది. మాల్ ఆఫ్ ఖతార్ లో ఆగస్టు 12, 13 తేదీలలో మధ్యాహ్నం నుండి రాత్రి 10 గంటల వరకు వేడుకలను నిర్వహించనున్నట్లు పేర్కొంది. వేడుకల్లో చివరి రోజున 100 డేస్ టు గో గ్రాండ్ ఫినాలే ఉంటుందని పేర్కొంది. #100DaysToGo అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఫోటోలు తీసి సోషల్‌కి అప్లోడ్ చేయడం ద్వారా వేడుకలు జరుపుకోవాలని అభిమానులను సుప్రీమ్ కమిటీ కోరింది. ఖతార్ నివాసితులకు మాత్రమే ఇందులో పాల్గొనే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..