‘బింబిసార’ సెంటిమెంట్ ‘కార్తికేయ 2’కి వర్తిస్తుందా.?
- August 08, 2022
సూపర్ నేచురల్ పవర్స్, ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన ‘బింబిసార’ సినిమాని ఈ మధ్య ప్రేక్షకులు బాగానే ఆదరించారు. స్టోరీనీ, స్ర్కీన్‌ప్లేనీ విమర్శకులు సైతం మెచ్చుకున్నారు. అలా పాజిటివ్ బజ్‌తో వీకెండ్‌ని దాటుకుని, ఇంకా ధియేటర్లలో రన్ అవుతోంది ‘బింబిసార’ సినిమా.
ఇప్పుడు కాస్త ఇదే కాన్సెప్ట్‌తో ఫిక్షనల్ మూవీగా రూపొందుతోన్న సినిమా ‘కార్తికేయ 2’. గతంలో వచ్చిన ‘కార్తికేయ’ సినిమాకి ఫ్రాంచైజీ అంటూ ఈ సినిమా రూపుదిద్దుకుంది. వాయిదాల పర్వం ముగించుకుని, ఆగస్టు 13న ‘కార్తికేయ 2’ ధియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.
కాగా, ఈ సినిమాకి ఒక్క రోజు ముందే నితిన్ నటించిన ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమా కూడా రిలీజవుతోంది. అయితే, ఈ రెండు సినిమాలూ కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్. నితిన్ పక్కా మాస్ కమర్షయిల్ మూవీతో వస్తున్నాడు.
‘కార్తికేయ 2’గా నిఖిల్ ఫాంటసీ మూవీతో ఎంటర్ అవుతున్నాడు. కమర్షియల్ మూవీస్ అంటే ఏముంది.? నాలుగు పాటలూ, మూడు ఫైట్లూ.. మహా అయితే, ఓ నాలుగు ఎలివేషన్లూ.. ఇదే కదా. కానీ, ఫాంటసీ మూవీ పూర్తిగా డిఫరెంట్ ఫార్మేట్‌లో వుంటుంది.
ఆల్రెడీ ‘బింబిసార’తో ప్రేక్షకులు అలాంటి ఫీల్‌నే ఎంజాయ్ చేశారు.మళ్లీ అలాంటి ఫీలింగ్ కోరుకునే వారికి ‘కార్తికేయ 2’ ఓ ఆప్షన్ అవుతుంది కదా. అలా నిఖిల్‌కి ఈ సెంటిమెంట్ కలిసొస్తుందేమో చూడాలి మరి.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!