ప్రబాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్: కానీ, ఇప్పుడు కాదుగా.!
- August 17, 2022
‘బాహుబలి’తో ప్యాన్ ఇండియా స్టార్ అయిన ప్రబాస్, ఆ తర్వాత చేసిన ‘సాహో’, ‘రాధే శ్యామ్’ సినిమాలతో తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ డిజప్పాయింట్మెంట్ తీర్చేందుకు, ఆ తర్వాత వరుసగా సినిమాలు లైన్లో పెట్టేశాడు ప్రబాస్.
ప్రబాస్ ఓకే చేసిన సినిమాలన్నీ సెట్స్ పైనే వుండడం విశేషం. కానీ, అన్నీ భారీ బడ్జెట్ సినిమాలే కావడంతో, ఇప్పుడప్పుడే వీటిలో ఏ సినిమాలూ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
పౌరాణీకం నేపథ్యంలో రూపొందుతోన్న ‘ఆది పురుష్’ సినిమా దాదాపు పూర్తయిపోయిందంటున్నారు. కానీ, భారీ వీఎఫ్ఎక్స్ పనులతో ఈ సినిమా రిలీజ్ ఇంకా ఆలస్యం కానుందట. కృతి సనన్ హీరోయిన్గా నటించింది ఈ సినిమాలో. ఈ ఏడాది చివరికల్లా ‘ఆది పురుష్’ని ధియేటర్లలోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
కాగా, మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘సలార్’ వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో రిలీజ్ కానుందనీ లేటెస్ట్గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజా అప్డేట్ ప్రకారం ‘ప్రాజెక్ట్ కె’ మూవీని వచ్చే ఏడాది అక్టోబర్ 18న రిలీజ్ చేయబోతున్నారనీ తెలుస్తోంది.
అంటే, ఒక్క నెల గ్యాప్‌లో ప్రబాస్ నుంచి రెండు భారీ చిత్రాలు రాబోతున్నాయన్న మాట. టైమ్ ట్రావెలింగ్ నేపథ్యంలో నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. చైనా, అమెరికా టార్గెట్‌గా ఈ సినిమాని భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందిస్తున్నారు.
బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుండగా, బాలీవుడ్ భామలు దీపికా పదుకొనె, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







