డ్రైవింగ్‌లో వ్యర్థాల పారబోత.. 1,000 దిర్హామ్ జరిమానా, 6 బ్లాక్ పాయింట్లు
- August 19, 2022
యూఏఈ: ఎమిరేట్‌లో ప్రయాణిస్తున్న సమయాల్లో వాహనాల్లోని చెత్తను రోడ్లపై, ప్రజా సౌకర్యాలపై విసిరినందుకు అబుదాబిలో మొత్తం 162 మంది వాహనదారులకు జరిమానా విధించారు. 2022 మొదటి ఆరు నెలల్లో వాహనాల నుంచి వ్యర్థాలను రోడ్డుపై వేస్తూ పలువురు డ్రైవర్లు పట్టుబడ్డారని అబుదాబి పోలీసులు తెలిపారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వ్యర్థాలను రోడ్డుపై విసిరినందుకు వారికి 1,000 దిర్హామ్ ల జరిమానాతోపాటు ఆరు బ్లాక్ పాయింట్లు విధించారు. నిర్దేశిత ప్రదేశాలలో మాత్రమే చెత్తను, వ్యర్థాలను వేయాలని అధికారులు సూచించారు. పర్యావరణ భద్రత, ప్రజారోగ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని వాహనదారులను కోరారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాల నుంచి ఎలాంటి వ్యర్థాలు వేయకుండా ప్రయాణికులను హెచ్చరించాలని డ్రైవర్లకు సూచించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







