విద్యార్థులకు రాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేయాలి: ఖతార్

- August 19, 2022 , by Maagulf
విద్యార్థులకు రాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేయాలి: ఖతార్

 

దోహా: 2022-2023 విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్థులు పాఠశాల ప్రారంభానికి గరిష్ఠంగా 48 గంటల ముందు కోవిడ్-19 రాపిడ్ యాంటిజెన్ పరీక్షను (ఒక్కసారి మాత్రమే) చేయించుకోవాలని విద్యా, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ఫలితాల్లో నెగిటివ్ వచ్చిన వారిని మాత్రమే పాఠశాల ప్రాంగణంలోకి అనుమతి ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు పాఠశాల ఆరోగ్య సేవల విభాగం, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం సమన్వయంతో వారి విద్యార్థులందరికీ యాంటిజెన్ టెస్ట్ కిట్‌లను అందించడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పాఠశాలలు, కిండర్ గార్టెన్‌ల ప్రిన్సిపాల్‌లకు మంత్రిత్వ శాఖ సర్క్యులర్‌ జారీ చేసింది. యాంటిజెన్ పరీక్షల సమయాలను తెలుపుతూ తల్లిదండ్రులకు SMS సందేశాలను పంపాలని పాఠశాలలకు సూచించారు. ఆగస్ట్ 21 నుంచి పాఠశాలు ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com