ఇబ్రా లోయలో మునిగి పౌరుడు దుర్మరణం
- August 22, 2022
మస్కట్: ఇబ్రాలోని విలాయత్‌లో విషాదం చోటు చేసుకుంది. అక్కడి లోయలో మునిగి ఓ పౌరుడు దుర్మరణం పాలయ్యాడు. స్థానికులు, రెస్క్యూ బృందాలు పౌరుడి మృతదేహాన్ని వెలికితీసి ఆసుపత్రికి తరలించారని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ(CDAA) తెలిపింది. సీడీఏఏ తెలిపిన వివరాల ప్రకారం.. నార్త్ అల్-షర్కియా గవర్నరేట్‌లోని ఇబ్రాలోని విలాయత్‌లోని లోయలో ఓ పౌరుడు మునిగినట్లు సమాచారం అందింది. వెంటనే సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్మెంట్లోని రెస్క్యూ బృందాలు స్పందించాయి. సంఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సాయంతో పౌరుడిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారని సీడీఏఏ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!
- ముగిసిన రెడ్ వేవ్ 8 నావల్ డ్రిల్..!!
- దుబాయ్ లో T100 ట్రయాథ్లాన్..ఆర్టీఏ అలెర్ట్..!!
- బహ్రెయిన్ లో దీపావళి మిలన్..!!
- STPలో నీటి నాణ్యతపై అధ్యయనం..!!
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!







