‘పిసినారి’ బిగ్‌బాస్: ఈసారి అంత తగ్గించేశాడా.?

- September 03, 2022 , by Maagulf
‘పిసినారి’ బిగ్‌బాస్: ఈసారి అంత తగ్గించేశాడా.?

బుల్లితెర ప్రేక్షకుల్లో బిగ్‌బాస్ షో అంటే ఆ క్రేజే వేరప్పా. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయిన బిగ్‌బాస్ షోని తిట్టుకుంటూనే జనం చూసేస్తుంటారు. అందుకే ఎన్ని కాంట్రవర్సీలొచ్చినా ఆ షోకున్న క్రేజ్ మాత్రం తగ్గదు. 

బిగ్‌ హౌస్‌లో ఒక్క వారం రోజులున్నా ఆ కంటెస్టెంట్లకు వచ్చే క్రేజే వేరు. కానీ, ఈ సీజన్ బిగ్‌బాస్ హౌస్‌కి వెళ్లేందుకు సెలబ్రిటీలు అంతగా ఆసక్తి చూపించలేదట.అందుకు కారణం నిర్వాహకులే. కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ బాగా తగ్గించేశారట. దాంతో, హౌస్‌లోకి రావడానికి ఏమంత ఇంట్రెస్ట్ చూపించలేదనీ తెలుస్తోంది.

గతంలో కంటెస్టెంట్లు అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి మరీ తీసుకొచ్చేవారు. కానీ, ఇప్పుడు.. ఇంతే ఇస్తాం నచ్చితే రండి అన్నట్లుగా వుందట నిర్వాహకుల తీరు. దాంతో, పేరున్న సెలబ్రిటీలు ఆసక్తి చూపించలేదట.అలా ఈ సారి రాబోయే బిగ్‌బాస్ కంటెస్టెంట్లలో ఒకరిద్దరు తప్ప పెద్దగా తెలిసిన మొహాలేమీ వుండవని అంటున్నారు.

19 మంది కంటెస్టెంట్లు వుండబోతున్నారట.అయితే, మొదట 17 మంది కంటెస్టెంట్లు డైరెక్ట్ ఎంట్రీ ఇస్తుండగా, మరో ఇద్దరు మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. ఈ నెల 4 వ తేదీ నుంచి బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ స్టార్ట్ కానుంది.ఎప్పటిలాగే, నాగార్జున హోస్ట్‌గా ఈ షో ప్రారంభం కానుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com