కరణ్ షోలో కృతిసనన్ బోల్డ్ వ్యాఖ్యలు: అందుకే ఆ రోల్ చేయలేదన్న కృతిసనన్
- September 03, 2022
బాలీవుడ్ ప్రముఖ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ షోలో సెలబ్రిటీల నుంచి బోల్డ్ సమాధానాలు రప్పించడం పరిపాటి. అందుకే కరణ్ జోహార్ షోకి అంత క్రేజ్. అయితే, కొంతమంది సెలబ్రిటీలు ఈ షోకి రావడానికి కూసింత భయపడుతుంటారు కూడా.
తాజాగా కృతిసనన్ ఈ షోలో పార్టిసిపేట్ చేసింది. ఈ సందర్భంగా ఆమె తన పర్సనల్ విషయాలను చాలా పంచుకుంది. ‘లస్ట్ స్టోరీస్’ అను ఓ అడల్ట్ వెబ్ సిరీస్ గురించి తెలిసిందే. ఆ వెబ్ సిరీస్‌తోనే కియారా అద్వానీ పాపులర్ అయ్యింది. స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.
అయితే, మొదట్లో ఆ పాత్ర కృతి సనన్ దగ్గరకొచ్చిందట. కానీ, ఆ పాత్రలోని బోల్డ్నెస్ కారణంగా కృతి ఆ ఛాన్స్ మిస్ చేసుకుందట. శృంగార సమస్యతో బాధపడుతున్న ఓ మహిళ వైబ్రేటర్ ద్వారా ఆ తృప్తిని పొందుతుంది. ఆ సన్నివేశం చాలా జుగుప్స కలిగిస్తుంది. కేవలం ఆ సన్నివేశం కారణంగానే కృతి సనన్ ఆ వెబ్ సిరీస్‌ని నో చెప్పిందట.
తాజాగా ఆ విషయం కరణ్ షో ద్వారా బయట పడింది. అయితేనేం, ప్రస్తుతం కృతిసనన్ కూడా బాలీవుడ్లో స్టార్డమ్ దక్కించుకుంది. పలు బిగ్ ప్రాజెక్టులతో కృతి సనన్ చాలా బిజీ అయిపోయింది. తెలుగులో ‘వన్ నేనొక్కడినే’ సినిమాతో డెబ్యూ చేసిన ఈ ముద్దుగుమ్మ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ప్రబాస్ సరసన ‘ఆదిపురుష్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరిస్తోంది.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!