కొత్తగా ట్రైనింగ్ వీసాను తీసుకొచ్చిన NPRA

- September 04, 2022 , by Maagulf
కొత్తగా ట్రైనింగ్ వీసాను తీసుకొచ్చిన NPRA

మనామా: ఆరు నెలలపాటు చెల్లుబాటు అయ్యే ట్రైనింగ్ ప్రయోజనాల కోసం మల్టీ-ఎంట్రీ ఇ-వీసాను ప్రవేశపెట్టినట్లు జాతీయత, పాస్‌పోర్ట్‌లు, నివాస వ్యవహారాలు (NPRA) ప్రకటించింది.  క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి అయిన ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా నేతృత్వంలోని క్యాబినెట్ ప్రారంభించిన ఎన్పీఆర్ఏ సేవలు, ఆర్థిక పునరుద్ధరణ ప్రణాళికను మెరుగుపరచడానికి చేపట్టిన 24 కార్యక్రమాలలో ట్రైనింగ్ వీసా జారీ ఓ భాగంగా ఉందని ఎన్పీఆర్ఏ తెలిపింది. అంతర్గత మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ, షేక్ హిషామ్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ ఖలీఫా మాట్లాడుతూ..  వీసాను మరో ఆరు నెలల పాటు పొడిగించే అవకాశం ఉందన్నారు. ఆసక్తి గల వారు BD60 రుసుముతో www.evisa.gov.bh ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ట్రైనర్ లేదా ట్రైనీ కోసం వీసా జారీ చేయబడుతుందన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com