బ్రిటన్ కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్ ఎన్నిక

- September 05, 2022 , by Maagulf
బ్రిటన్ కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్ ఎన్నిక

లండన్: బ్రిటన్ నూతన ప్రధానిగా లిజ్ ట్రస్ ఎన్నికయ్యారు. బిట్రన్ ప్రధాని పదవికి జరిగిన ఎన్నికల్లో భారత సంతతికి చెందిన బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌పై విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ గెలుపొందారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు) ఎన్నికల ఫలితాలను ప్రకటించారు.లిజ్ 20 వేలకు పైగా ఓట్ల తేడాలో తన ప్రత్యర్థి సునాక్‌పై విజయం సాధించారు. పార్టీలో సభ్యులలో 60,399 మంది సునాక్‌కు ఓటు వేయగా.. 81,326 మంది లిజ్‌కు ఓటేశారు.బ్రిటన్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న లిజ్ ట్రస్.. ఆ పదవిని చేపడుతున్న మూడో మహిళగా నిలవనున్నారు.   

బ్రిటన్ నూతన ప్రధానిగా  ఎన్నికైన అనంతరం లిజ్ మాట్లాడుతూ.. ‘‘కన్సర్వేటివ్ పార్టీ నాయకురాలుగా ఎన్నుకోబడినందుకు నేను గౌరవంగా భావిస్తున్నాను. మా గొప్ప దేశానికి నాయకత్వం వహించడానికి, నాయకత్వం అందించడానికి నాపై మీ నమ్మకాన్ని ఉంచినందుకు ధన్యవాదాలు. ఈ కష్ట సమయాల్లో మనందరినీ ముందుకు తీసుకురావడానికి నేను సాహసోపేతమైన చర్య తీసుకుంటాను. మన ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేయండి.యునైటెడ్ కింగ్‌డమ్ సామర్థ్యాన్ని ఆవిష్కరించండి’’అని పేర్కొన్నారు. 

ఇక, బోరిస్ జాన్సన్ జూలైలో బ్రిటన్ ప్రధాని పదవికి రాజీనామాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక, బోరిస్ జాన్సన్ తన రాజీనామాను అధికారికంగా సమర్పించేందుకు క్వీన్ ఎలిజబెత్‌ను కలవడానికి మంగళవారం స్కాట్లాండ్‌కు వెళ్లనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com