అక్రమ నిర్భందం కేసులో అధికారిపై విచారణ

- September 05, 2022 , by Maagulf
అక్రమ నిర్భందం కేసులో అధికారిపై విచారణ

సౌదీ అరేబియా: పబ్లిక్ ప్రాసిక్యూషన్‌లోని జైళ్లు నిర్బంధ కేంద్రాల పర్యవేక్షణ విభాగంలోని ఓ అధికారిపై ప్రభుత్వం విచారణ చేపట్టింది. తన అధికారాలను దుర్వినియోగం చేస్తూ ఆ అధికారి ఒక వ్యక్తిని నిర్భంధించాడు.అతన్ని నిర్భంధించేందుకు ఎలాంటి ఆధారాలు, డాక్యుమెంట్స్ లేకుండా తనపై చట్ట విరుద్ధంగా చర్యలు తీసుకున్నాడు. ఆ వ్యక్తి ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ చేపట్టారు. చట్టపరంగా అవసరమైన ఎలాంటి పత్రాలు లేకుండానే అతన్ని నిర్భందించినట్లు గుర్తించారు.అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఆ అధికారిని నేరస్తుడిగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిర్ధారించింది.ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని సదరు డిపార్ట్ మెంట్ అధికారులకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ సూచించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com