గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో షార్జా స్టేడియం

- September 05, 2022 , by Maagulf
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో షార్జా స్టేడియం

షార్జా: షార్జాలోని షార్జా క్రికెట్ స్టేడియం అరుదైన ఘనత సాధించింది.అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్ లకు వేదికగా నిలిచి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది.శనివారం శ్రీలంక-అఫ్గానిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ ఈ ఘనత కు వేదికైంది.ఆ మ్యాచ్ తో కలుపుకుంటే ఇప్పటి వరకు షార్జా స్టేడియంలో 9 టెస్ట్ మ్యాచ్ లు, 28 టీ ట్వంటీలు, 244 వన్డే మ్యాచ్ లు జరిగాయి.ఒకే వేదికపై ఇన్ని మ్యాచ్ లు జరిగిన ఘనత ఇప్పటి వరకు మెల్ బోర్న్ లోని సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ పేరిట ఉంది. ఆ రికార్డ్ ను షార్జా క్రికెట్ స్టేడియం బద్దలు కొట్టింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com