ఒమన్‌లో విద్యుత్ అంతరాయంతో పాఠశాలలకు సెలవు
- September 06, 2022
మస్కట్: విద్యుత్తు అంతరాయం కారణంగా ప్రభావితమైన ప్రాంతాలలో ఉన్న పాఠశాలలకు విద్యా మంత్రిత్వ శాఖ సెలవు ప్రకటించింది. ఈ మేరకు విద్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. విద్యుత్ అంతరాయం కారణంగా ప్రభావితమయ్యే ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు మంగళవారం సెలవు ఇస్తున్నట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఒమన్ సుల్తానేట్ గవర్నరేట్‌లలోని విద్యా డైరెక్టరేట్‌లు పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలని విద్యాశాఖ సూచించింది. ప్రతి గవర్నరేట్ లో స్థానిక పరిస్థితులను అనుసరించి బుధవారం నుంచి పాఠశాలలను తిరిగి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను విద్యాశాఖ ఆదేశించింది.
తాజా వార్తలు
- సింగపూర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఏపీలో విద్యుత్ ఛార్జీలు తగ్గింపు
- ETCA ఆద్వర్యంలో ఘనంగా 15 వ మెగా బతుకమ్మ సంబరాలు
- నేడు హైదరాబాద్‌లో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ కార్యక్రమం ప్రారంభం
- తానా ఆధ్వర్యంలో 'ప్రతిభామూర్తులు' సభ విజయవంతం
- మైటా ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- ట్రోఫీని హోటల్ గదికి తీసుకుకెళ్లిన పీసీబీ
- టీమిండియా విజయం సాధించడంపై ప్రధాని మోదీ హర్షం
- అమరావతిలో 12 బ్యాంకుల హెడ్ ఆఫీసులు..
- తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు