నీరజ్ చోప్రా మరో రికార్డు..
- September 09, 2022
జ్యురిచ్: వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరో అరుదైన ఘనత సాధించారు. మెన్స్ జావెలిన్ థ్రోలో డైమండ్ ట్రోఫీ గెలిచి, ఈ ఘనత సాధించిన మొదటి భారతీయుడిగా నిలిచారు.
స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్‌లో గురువారం మెన్స్ జావెలిన్ డైమండ్ లీగ్ ఫైనల్ పోటీ జరిగింది. ఈ పోటీలో చెక్ రిపబ్లిక్కు చెందిన జాకుబ్ వాడ్లెక్, జర్మనీకి చెందిన జులియన్ వెబ్బర్‌ను దాటుకుని విజేతగా నిలిచాడు. నీరజ్ 88.44 మీటర్లు జావెలిన్ థ్రో చేసి మొదటి స్థానం సంపాదించి, డైమండ్ ట్రోఫీ గెలుపొందాడు. నీరజ్ వరుసగా 84.15 మీటర్లు, 88.44 మీటర్లు, 88.00 మీటర్లు, 86.11 మీటర్లు, 87.00 మీటర్లు, 83.60 మీటర్లు జావెలిన్ థ్రో చేశారు. రెండోసారి అత్యధికంగా 88.44 మీటర్లు థ్రో చేయగా, చెక్ రిపబ్లిక్ అథ్లెట్ వాడ్లెక్ రెండో సారి 86.94 మీటర్లు థ్రో చేశాడు. దీంతో మిగతా ఇద్దరు ఆటగాళ్లకంటే మెరుగైన ప్రదర్శన చేసి నీరజ్ ట్రోఫీ సొంతం చేసుకున్నాడు.
రెండో స్థానంలో నిలిచిన వాడ్లెక్ సాధించిన అత్యధిక స్కోరు కంటే నీరజ్ మూడుసార్లు ఎక్కువ స్కోరు సాధించాడు. గత ఏడాది ఒలంపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా, ఈ ఏడాది వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో సిల్వర్ మెడల్ సాధించారు. గతంలో కూడా నీరజ్ డైమండ్ లీగ్‌లో పాల్గొన్నాడు. 2017లో ఏడో స్థానంలో నిలవగా, 2018లో నాలుగో స్థానంలో నిలిచారు. ఈ సారి ట్రోఫీ సాధించారు.
తాజా వార్తలు
- విద్యుత్, ఇంధన రంగంలో పెట్టుబడులు.. ఆకర్షణీయ దేశాలు ఇవే..!!
- 8 ఏళ్ల తర్వాత మనామా సూక్ గేట్‌వే ఆర్ట్ వర్క్ తొలగింపు..!!
- గుండెను పదిలంగా చూసుకోండి: డాక్టర్ పి. చంద్రశేఖర్
- కువైట్ మునిసిపాలిటీ తనిఖీలు..వాహనాలు తొలగింపు..!!
- ప్రపంచ దేశాల్లో యోగాకి ప్రత్యేక గుర్తింపు..
- ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగానికి గైడ్ లైన్స్ అవసరం..!!
- ఇటాలియన్ అధికారులకు క్రిమినల్ అప్పగింత..!!
- నాలుగు కొత్త విజిట్ వీసా కేటగిరీలను ప్రకటించిన యూఏఈ..ఎంట్రీ పర్మిట్‌లో సవరణలు..!!
- సింగపూర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఏపీలో విద్యుత్ ఛార్జీలు తగ్గింపు