కార్మికుల బహిష్కరణ వార్తలను ఖండించిన యూఏఈ

- September 10, 2022 , by Maagulf
కార్మికుల బహిష్కరణ వార్తలను ఖండించిన యూఏఈ

యూఏఈ: ఆఫ్రికన్ దేశాలకు చెందిన కొంతమంది కార్మికులను బహిష్కరించడంపై మీడియా రిపోర్టింగ్‌లకు సంబంధించిన ఆరోపణలు అవాస్తవమని యూఏఈ విదేశాంగ, అంతర్జాతీయ సహకార మంత్రిత్వ శాఖలోని మానవ హక్కుల విభాగం డైరెక్టర్ సయీద్ అల్ హెబ్సీ ఖండించారు. మీడియాలో చూపుతున్న నివేదికలు పాతవని పేర్కొన్నారు. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫర్ హ్యూమన్ రైట్స్ పాలసీస్ ప్రచురించిన నివేదికను మీడియాలో తప్పుగా చూపుతున్నారన్నారు. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ గతంలో 2021లో ప్రచురించిన నివేదికలను మీడియాలో చూపుతున్నారని అల్ హెబ్సీ అన్నారు. వివిధ ఉల్లంఘనల్లో అరెస్టయిన కార్మికులపై చట్టపరమైన విధానాలలో దేశ బహిష్కరణ జరిగిందని, ఇదంతా సాధారణ ప్రక్రియలో భాగమని అల్ హెబ్సీ పేర్కొన్నారు. కార్మిక విధానాల్లో యూఏఈ పూర్తి పారదర్శకతకు కట్టుబడి ఉందని, ఈ విషయంలో సంబంధిత అధికారుల అధికారిక ప్రకటనలను ప్రస్తావించాలని మీడియాను అల్ హెబ్సీ కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com