ఆపన్నులకు అండగా కింగ్స్‌ గ్రాంట్‌

- June 15, 2015 , by Maagulf
ఆపన్నులకు అండగా కింగ్స్‌ గ్రాంట్‌

కింగ్‌ హమాద్‌, రాయల్‌ ఛారిటీ ఆర్గనైజేషన్‌లో రిజిస్టర్‌ చేసుకున్న కుటుంబాలకు రమదాన్ సందర్భంగా ‘గ్రాంట్‌’ మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాయల్‌ ఛారిటీ ఆర్గనైజేషన్‌కి షేక్‌ నాజర్‌ బిన్‌ హమాద్‌ అల్‌ ఖలీఫా ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. పవిత్ర రమదాన్ మాసంలో, పేద కుటుంబాలకు ఈ గ్రాంట్‌ ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది. ప్రతి ఒక్కరూ గౌరవప్రదమైన జీవితం గడపడానికి తగు రీతిలో సహాయ సహకారాలు అందిస్తున్న కింగ్‌ హమాద్‌కి ఈ సందర్భంగా షేక్‌ నాజర్‌ కృతజ్ఞతలు తెలిపారు. పవిత్ర రమదాన్ మాసంలో అనాధలకూ, భర్తలను కోల్పోయిన మహిళలకు అండదండలు అందించాలనే ఆలోచన చాలా గొప్పదని షేక్‌ నాజర్‌ అన్నారు. రాయల్‌ ఛారిటీ ఆర్గనైజేషన్‌ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో భవిష్యత్‌లో నిర్వహిస్తామని చెప్పారాయన.

 

--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com