ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో పెరిగిన కువైట్ కార్మికులు
- September 14, 2022
కువైట్ సిటీ: ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో కువైట్ కార్మికుల సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. ఈ మేరకు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (పీఏసీఐ) తెలిపింది. పీఏసీఐ లెక్కల ప్రకారం.. 2021 జనవరి నుండి 2022 మధ్య వరకు 18,558 కువైటీలు ప్రభుత్వ రంగంలో చేరారు. దీంతో ప్రభుత్వ రంగంలోని మొత్తం కువైట్ ఉద్యోగుల సంఖ్య 2020 చివరినాటికి 354,384 ఉండగా.. 2022 జూన్ చివరి నాటికి 372,942కి పెరిగింది. అదే కాలంలో ప్రైవేట్ రంగంలో సుమారు 12,681 మంది కువైటీలు కొత్తగా ఉద్యోగంలో చేరారు. 2020 చివరి నాటికి 63,240 ఉన్న ఉద్యోగుల సంఖ్య 2022 మధ్య నాటికి 75,921కి చేరుకుందని పీఏసీఐ తెలిపింది. నాన్-కువైట్ కార్మికులకు సంబంధించి.. 2021 ప్రారంభం నుండి 2022 మధ్య కాలంలో దాదాపు 185,360 మంది నాన్-కువైట్‌లు ప్రైవేట్ రంగాన్ని విడిచిపెట్టారు. 2022 జూన్ చివరి నాటికి ప్రైవేట్ రంగంలో మొత్తం నాన్-కువైట్ ఉద్యోగుల సంఖ్య 1,355,935కి తగ్గిందని పీఏసీఐ లెక్కలు చెబుతున్నాయి. జనాభా లెక్కల ప్రకారం.. 2019 చివరి నాటికి దాదాపు ఒక మిలియన్ 656 వేల 983 మంది కార్మికులు ఉండగా.. 2020 డిసెంబర్ నాటికి ఆ సంఖ్య ఒక మిలియన్ 541 వేల 295 కు తగ్గింది.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







