బిగ్‌బాస్ సన్నీ హీరోగా ‘సకల గుణాభిరామ’.!

- September 14, 2022 , by Maagulf
బిగ్‌బాస్ సన్నీ హీరోగా ‘సకల గుణాభిరామ’.!

బిగ్‌బాస్ గేమ్ షోకి వున్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెప్యుటేషన్‌తో పని లేకుండా, ఆ షో విపరీతంగా క్రేజ్ దక్కించుకుంటుంటుంది. అదే క్రేజ్‌ని తాను కూడా క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడు గత సీజన్ విన్నర్ సన్నీ. ప్రస్తుతం బిగ్‌బాస్ ఆరో సీజన్ నడుస్తోంది. ఈ టైమ్‌లో సన్నీ హీరోగా తెరకెక్కిన సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 
బిగ్‌బాస్ ఐదో సీజన్ విన్నర్ అయిన సన్నీ హీరోగా తెరకెక్కిన సినిమా ‘సకల గుణాభిరామ’. ఈ శుక్రవారమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అషిమా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీనివాస్ వెలిగొండ దర్శకత్వం వహిస్తున్నారు. 
వీజెగా కెరీర్ స్టార్ట్ చేసిన సన్నీ, తర్వాత యాంకర్‌గానూ, సీరియల్ ఆర్టిస్టుగానూ తనదైన ముద్ర వేసుకున్నాడు. బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌గా తనదైన గేమ్ ఆడాడు. ఆటలో జెన్యూనిటీ చూపించాడు సన్నీ. 
ఆ జెన్యూనిటీ మెచ్చిన ప్రేక్షకులు బిగ్‌బాస్ విన్నర్‌గా సన్నీని నిలబెట్టారు. అలా పాపులర్ అయిన సన్నీతో సంజీవరెడ్డి అనే ప్రొడ్యూసర్ ఓ సినిమా నిర్మించాడు. అదే ‘సకల గుణాభిరామ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ని చాలా గ్రాండ్‌గా నిర్వహించారు.
ఈ ఈవెంట్‌కి బిగ్ బాస్ కంటెస్ట్లెంట్లు అయిన రవి, సోహెల్ తదితరులు వచ్చి, హీరో అయినందుకు సన్నీని అభినందించారు. మేం తీర్చుకోలేని కోరిక సన్నీ తీర్చుకున్నాడు. ఈ సినిమా సన్నీకి మంచి బ్రేక్ ఈవెన్ కావాలని ఆశీర్వదించారు. మొత్తానికి బిగ్‌బాస్ హౌస్‌లో వున్నప్పుడు ఆడియన్స్ చేత హీరో అనిపించుకున్న సన్నీ, ఎట్టకేలకు తన గోల్ రీచ్ అయ్యాడు. సక్సెస్ అవుతాడా.? లేదా.? అనేది చూడాలి మరి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com