గృహ కార్మికుల ఒప్పందాలకు త్వరలో బీమా: మంత్రిత్వ శాఖ

- September 16, 2022 , by Maagulf
గృహ కార్మికుల ఒప్పందాలకు త్వరలో బీమా: మంత్రిత్వ శాఖ

రియాద్: గృహ కార్మిక ఒప్పందాలకు సంబంధించి బీమాను త్వరలో ఆమోదించనున్నట్లు మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRSD) ప్రతినిధి సాద్ అల్-హమ్మద్ అల్-హమ్మద్ తెలిపారు. ఇది యజమానులు, కార్మికుల హక్కులను పరిరక్షిస్తుందన్నారు. ముసానేడ్ ప్లాట్‌ఫారమ్‌తో అనుసంధానం చేయడానికి ముందు పథకం రూపకల్పన చివరి దశలో ఉందని ఆయన పేర్కొన్నారు. కార్మికుడు మరణించిన సందర్భంలో భర్తీ చేసే ఉద్యోగిని రిక్రూట్ చేసుకునేందుకు అయ్యే ఖర్చులను భర్తీ చేయడం ద్వారా యజమాని హక్కును బీమా పరిరక్షిస్తుందన్నారు. దీనితోపాటు  దీర్ఘకాలిక, క్లిష్టమైన వ్యాధుల కారణంగా కార్మికుడు పని చేయలేని సందర్భంలో యజమాని హక్కును బీమా కాపాడుతుందన్నారు. అలాగే కార్మికుడు పని చేయడానికి నిరాకరించినా లేదా పనికి దూరంగా ఉంటే యజమానికి పరిహారం చెల్లించబడుతుందన్నారు. గృహ కార్మికుల హక్కులకు సంబంధించి.. ప్రమాదం కారణంగా శాశ్వత పూర్తి వైకల్యం లేదా శాశ్వత పాక్షిక వైకల్యం సంభవించినప్పుడు కార్మికుడికి పరిహారం అందించేందుకు బీమా దోహదపడుతుందని అల్-హమ్మద్ చెప్పారు. గృహ కార్మికులను నియమించుకోవడానికి ఆమోదించబడిన ఖర్చుల గరిష్ఠ పరిమితిని దాటవద్దని రిక్రూట్‌మెంట్ కంపెనీలు, సంస్థలకు మానవ వనరుల మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com