తప్పు తెలుసుకున్న రౌడీ.! ఆటిట్యూడ్‌కి గుడ్ బై చెప్పేశాడా.?
- September 20, 2022ఆటిట్యూడ్‌కి పెట్టింది పేరు విజయ్ దేవరకొండ. నిజమే, సింగిల్ నైట్‌లో స్టార్ అయిపోయిన హీరో విజయ్ దేవరకొండ. ఎలాంటి ఫిలిం బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ర్టీలో నిలదొక్కుకోవడం అన్నది అంత ఆషా మాషీ విషయం కాదు.
అయితే, ఇలాంటి వ్యక్తులు ఇండస్ర్టీకి కొత్తేం కాదు. అది చూసుకుని విజయ్ దేవరకొండ చూపించిన జోరు అంతా ఇంతా కాదు. అసలే ఆటిట్యూడ్. ఆ పై విజయ్ చేసిన ఓవరాక్షన్ వుందే. మాటల్లో చెప్పలేం. ‘లైగర్’ సినిమాతో విజయ్ దేవరకొండకు గట్టి షాక్ ఇచ్చేశారు ఫ్యాన్స్, ఫ్యాన్స్‌తో పాటూ ఆడియన్స్.
ఈ షాక్‌లో విజయ్ దేవరకొండ చాలా మారిపోయాడు. తప్పు తెలుసుకున్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. ఆటిట్యూడ్ పూర్తిగా పక్కన పెట్టేశాడు. ‘ఆచార్య’లా మారిపోయి నీతి పాఠాలు చెప్పేస్తున్నాడు.
‘కష్టపడి పని చేయండి, మిమ్మల్ని మీరు పుష్ చేసుకోండి. టాలెంట్ పై ఫోకస్ పెట్టండి. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోండి. విజయాన్ని ఆస్వాదించండి. మీకు నచ్చినట్లుగా మీరు జీవించండి..’ అంటూ తాజాగా ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు విజయ్ దేవరకొండ.
ఈ పోస్ట్ చూశాకా, విజయ్ తప్పు తెలుసుకున్నాడన్న మాట. మార్పు మంచిదే.. అంటూ నెటిజన్లు రిప్లై పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ మార్పు వెనక పెద్ద స్కెచ్ లేకపోలేదు అంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
విజయ్ నటిస్తున్న ‘ఖుషి’ మూవీ త్వరలో రిలీజ్‌కి ముస్తాబవుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అయినా విజయ్‌కి విజయం అందించాలంటే ఈ మాత్రం తగ్గాల్సిందే మరి.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం