మిధాని సంస్థ పై సైబర్ అటాక్..
- September 20, 2022
హైదరాబాద్: హైదరాబాద్ మిధాని సంస్థ సైబర్ అటాక్ కు గురైంది. మిధాని సంస్థ నుంచి సైబర్ చీటర్స్ రూ.40లక్షలు కొట్టేశారు. కెనడా నేషనల్ ఆల్ కంపెనీ నుంచి మిధాని సంస్థ.. అల్యూమినియం కొనుగోలు చేసింది. ఇందులో భాగంగా కొంత డబ్బును అడ్వాన్స్ గా ఇచ్చింది. ఇదే అదనుగా భావించిన సైబర్ నేరగాళ్లు.. అమెరికా అకౌంట్ నెంబర్ ను ఈ-మెయిల్ ద్వారా మిధాని సంస్థకు పంపారు.
సైబర్ చీటర్స్ పంపిన అమెరికా అకౌంట్ కు మిగతా డబ్బును మిధాని సంస్థ పంపింది. అయితే, తమ మిగతా డబ్బు చెల్లించాలని కెనడా నేషనల్ ఆల్ కంపెనీ మిధాని సంస్థను అడిగింది. దీంతో తాము మోసపోయామని గ్రహించిన మిధాని సంస్థ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







