ఒమన్‌లోని కోటలు తాత్కాలికంగా మూసివేత

- September 20, 2022 , by Maagulf
ఒమన్‌లోని కోటలు తాత్కాలికంగా మూసివేత

మస్కట్: నిర్వహణ పనుల నిమిత్తం ముసందం గవర్నరేట్‌లోని అనేక కోటలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు హెరిటేజ్, టూరిజం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దిబ్బ కోట 2022 సెప్టెంబర్ 19 నుండి 21 వరకు మూసివేయనున్నారు. అలాగే బఖా కోట నేటి నుండి సెప్టెంబర్ 22 వరకు, అల్ కమజ్రా కోట 2022 సెప్టెంబర్ 21 నుండి 23 వరకు మూసివేయనున్నట్లు టూరిజం మంత్రిత్వ శాఖ తెలిపింది. సందర్శకులు ఈ విషయాన్ని గమనించి తమ టూర్లను ప్లాన్ చేసుకోవాలని టూరిజం మంత్రిత్వ శాఖ కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com