సౌదీ ప్రధానిగా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్

- September 28, 2022 , by Maagulf
సౌదీ ప్రధానిగా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్

సౌదీ: రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు, సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్.. తన కుమారుడు, యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌ను రాజ్యానికి ప్రధానమంత్రిగా, అతని రెండవ కుమారుడు ప్రిన్స్ ఖలీద్‌ను రక్షణ మంత్రిగా నియమించారు. ఈ మేరకు రాయల్ డిక్రీని జారీ చేశారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మరో కుమారుడు ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్‌ను ఇంధన శాఖ మంత్రిగా నియమించారు. విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్, ఆర్థిక మంత్రి మహ్మద్ అల్ జదాన్, పెట్టుబడి మంత్రి ఖలీద్ అల్ ఫాలిహ్ స్థానాల్లో మార్పులేదు. ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ రక్షణ మంత్రిగా ఉండగా.. క్రౌన్ ప్రిన్స్ తమ్ముడు ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ గతంలో డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్‌గా పనిచేశారు. క్యాబినెట్ సమావేశాలకు కింగ్ సల్మాన్ అధ్యక్షత వహిస్తారని రాయల్ డిక్రీలో పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com