ఒమన్-యూఏఈ సంబంధాలు ప్రత్యేకమైనవి: యూఏఈ అధ్యక్షుడు

- September 28, 2022 , by Maagulf
ఒమన్-యూఏఈ సంబంధాలు ప్రత్యేకమైనవి: యూఏఈ అధ్యక్షుడు

మస్కట్: ఒమన్ సుల్తానేట్, యూఏఈ మధ్య ఉన్న చారిత్రాత్మక సంబంధాలు ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అన్నారు. ఒమన్-యూఏఈల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని ఒమన్ పర్యటనలో ఉన్న యూఏఈ అధ్యక్షుడు ఒక ప్రకటనలో తెలిపారు. షేక్ మహమ్మద్ తన మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్‌తో ఉన్న సన్నిహిత సోదర సంబంధాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. దివంగత హిజ్ మెజెస్టి సుల్తాన్ ఖబూస్ బిన్ సయీద్, దివంగత షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ మధ్య ఉన్న ప్రత్యేక సంబంధాలను  షేక్ మహ్మద్ గుర్తుచేసుకున్నారు. ప్రస్తుత నాయకత్వం తమ పూర్వీకుల సంప్రదాయాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న వనరులు, అవకాశాల వినియోగానికి విస్తృత అవకాశాలతో రాబోయే కాలంలో రెండు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలు అభివృద్ధి చెందుతాయని యూఏఈ అధ్యక్షుడు తెలిపారు.  అన్ని రంగాలలో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్‌తో కలిసి పనిచేయనున్నట్లు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com