ఒమన్-యూఏఈ సంబంధాలు ప్రత్యేకమైనవి: యూఏఈ అధ్యక్షుడు
- September 28, 2022
మస్కట్: ఒమన్ సుల్తానేట్, యూఏఈ మధ్య ఉన్న చారిత్రాత్మక సంబంధాలు ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అన్నారు. ఒమన్-యూఏఈల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని ఒమన్ పర్యటనలో ఉన్న యూఏఈ అధ్యక్షుడు ఒక ప్రకటనలో తెలిపారు. షేక్ మహమ్మద్ తన మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్‌తో ఉన్న సన్నిహిత సోదర సంబంధాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. దివంగత హిజ్ మెజెస్టి సుల్తాన్ ఖబూస్ బిన్ సయీద్, దివంగత షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ మధ్య ఉన్న ప్రత్యేక సంబంధాలను షేక్ మహ్మద్ గుర్తుచేసుకున్నారు. ప్రస్తుత నాయకత్వం తమ పూర్వీకుల సంప్రదాయాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న వనరులు, అవకాశాల వినియోగానికి విస్తృత అవకాశాలతో రాబోయే కాలంలో రెండు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలు అభివృద్ధి చెందుతాయని యూఏఈ అధ్యక్షుడు తెలిపారు. అన్ని రంగాలలో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్‌తో కలిసి పనిచేయనున్నట్లు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి