FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022.. సౌదీ మ్యాచ్‌కి స్పెషల్ విమాన సర్వీసులు
- September 30, 2022ఖతార్: FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 సందర్భంగా సౌదీ అరెబియా జట్టు ఆడే మ్యాచుల కోసం దమ్మామ్-దోహా మధ్య మరిన్ని విమాన సర్వీసులను నడుపనున్నట్లు ఖతార్ ఎయిర్వేస్ ప్రకటించింది. సౌదీ అరేబియాలోని ఫుట్‌బాల్ అభిమానులకు తమ జాతీయ జట్టుకు మద్దతు ఇచ్చేందుకు తమ నిర్ణయం దొహదం చేస్తుందని తెలిపింది. శీతాకాలపు షెడ్యూల్లో భాగమైన ఐదు రోజువారీ విమానాలతో పాటు, సౌదీ జాతీయ జట్టు ఆడబోయే మ్యాచ్‌ల కోసం మరో ఐదు విమానాలను నడుపనున్నట్లు ఖతార్ ఎయిర్‌లైన్ పేర్కొంది. నవంబర్ 22న సౌదీ అరేబియా వర్సెస్ అర్జెంటీనా మ్యాచ్ ఉండగా.. నవంబర్ 26న పోలాండ్.. నవంబర్ 30న మెక్సికో తో సౌదీ తలపడనుంది. ఫుట్ బాల్ అభిమానులు తమ వెబ్సైట్లో SAR1,436 ప్రత్యేక ధరతో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని ఖతార్ ఎయిర్ లైన్స్ సూచించింది.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్‌లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?