అక్టోబర్ నెలకు పెట్రోల్, డిజీల్ ధరల ప్రకటన. గత నెలతో పోలిస్తే కాస్త తగ్గింపు
- October 01, 2022
యూఏఈ : అక్టోబర్ నెలకు సంబంధించి పెట్రోల్, డిజీల్ ధరల రేట్లను ఇంధన కమిటీ ప్రకటించింది. శుక్రవారం సమావేశమైన కమిటీ అధికారులు గత నెలతో పోలిస్తే ధరలను కాస్త తగ్గించాలని నిర్ణయించారు. సూపర్ 98 పెట్రోల్ రేటు సెప్టెంబర్ లో లీటర్ కు 3.41 దిర్హామ్ లు ఉండగా దానిని 3.03 దిర్హామ్ లు చేశారు. స్పెషల్ 95 పెట్రోల్ ధర లీటరుకు 2.92 దిర్హామ్ అయ్యింది. సెప్టెంబర్లో ఇది 3.30 దిర్హామ్ లు గా ఉండేది. ఇక ఈ ప్లస్ 91 పెట్రోల్ ధర లీటరుకు సెప్టెంబర్ లో 3.22 దిర్హామ్ లు ఉండగా ఇప్పుడు 2.85 దిర్హామ్ లు చేశారు. డీజిల్ సెప్టెంబరులో 3.87 దిర్హామ్ లు ఉంటే దానిని 3.76 దిర్హామ్ కు తగ్గించారు. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.
తాజా వార్తలు
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







