అక్టోబర్ 13న కువైట్ లో పౌర విమానయానంపై వర్క్ షాప్
- October 07, 2022
కువైట్: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ICAO) సహకారంతో అక్టోబర్ 13(ఆదివారం)న పౌర విమానయానంపై వర్‌షాప్ నిర్వహించనుంది. విమానయాన రంగంలో ప్రాంతీయ ప్రయత్నాలకు మద్దతు తెలపడం, ఈ విషయంలో కువైట్ పాత్రను విస్తరించడం ఈ వర్క్‌షాప్ లక్ష్యం అని డీజీసీఏ డైరెక్టర్ జనరల్ యూసెఫ్ అల్-ఫోజాన్ అన్నారు. ఈ సమావేశంలో కువైట్, ఖతార్, ఒమన్, జోర్డాన్, సౌదీ అరేబియా, సుడాన్ దేశాల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. విమానయాన అనుమతులు, సంబంధిత అంతర్జాతీయ చట్టాలకు సంబంధించిన సమస్యలపై ఈ సమావేశంలో పాల్గొనే ప్రతినిధులు చర్చిస్తారన్నారు. కెనడాలోని మాంట్రియల్‌లో జరిగిన సభ్యదేశాల వార్షిక సమావేశాల మార్జిన్‌లపై కువైట్ విమాన యాన శాఖ ఇటీవల ICAOతో కన్సల్టెన్సీ ఒప్పందంపై సంతకం చేసిందని ఆయన వెల్లడించారు. కువైట్ ఏవియేషన్ విభాగాలకు బ్యాకప్ అందించడం, కువైట్ ఎయిర్ నావిగేషన్ సిస్టమ్‌లను అప్‌గ్రేడ్ చేసే ఈ ఒప్పందం ఐదేళ్లపాటు చెల్లుబాటులో ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







