బాలయ్య అన్‌స్టాపబుల్ 2కి ‘పవర్’ ఫుల్ ఎండింగ్.! నిజమేనా.?
- October 07, 2022
బిగ్ స్క్రీన్ పై నందమూరి నటసింహంగా పేరు తెచ్చుకున్న బాలయ్య బాబు, బుల్లితెరపైనా హోస్ట్‌గా సత్తా చాటారు. ‘అన్‌స్టాపబుల్’ అనే ప్రోగ్రామ్ ద్వారా హోస్ట్‌గానూ తానేం తక్కువ కాదంటూ హుందాతనం చూపించారు బాలయ్య.
ఆహా ఓటీటీ ఛానెల్ వేదికగా స్ట్రీమింగ్ అయిన ఈ అన్‌స్టాపబుల్ ప్రోగ్రామ్ బాలయ్యలోని మరో కోణాన్ని సక్సెస్‌ఫుల్‌గా ప్రొజెక్ట్ చేసిందనడం అతిశయోక్తి కాదేమో. ఇక, ఇప్పుడు ఈ అన్‌స్టాపబుల్ రెండో సీజన్‌కి రంగం సిద్ధమైంది.
ఫస్ట్ సీజన్ అనూహ్యంగా సక్సెస్ కావడంతో, రెండో సీజన్‌ని మరింత ఆసక్తిగా రూపొందించారట. తొలి సీజన్‌కి ఫస్ట్ గెస్ట్‌గా మోహన్ బాబును తీసుకురాగా, మహేష్ బాబుతో సీజన్‌కి అదిరిపోయే ఎండింగ్ ఇచ్చారు.
ఇక, తాజా సీజన్‌కి తొలి గెస్ట్‌గా నారా చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారట. అలాగే, మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సీజన్‌కి అటెండ్ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ సీజన్‌కే చిరంజీవి రానున్నారని ప్రచారం జరిగింది. కానీ, కుదరలేదు.
ఈ సీజన్‌కి ఆల్రెడీ చిరంజీవితో షో షూటింగ్ జరిగిందన్న ప్రచారం జరుగుతోంది. అలాగే, షోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో పవర్ ఫుల్ ఎండింగ్ ఇవ్వనున్నారన్నది మరో అప్డేట్. పవన్ కళ్యాణ్‌తో వుండబోయే లాస్ట్ ఎపిసోడ్ ఊహించని విధంగా ఆడియన్స్‌లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుందని చెబుతున్నారు. చూడాలి మరి, మెగాస్టార్, పవర్ స్టార్ ఆతిథ్యం బాలయ్య షోకి నిజమా.? కాదా.? అని తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
తాజా వార్తలు
- ప్రభుత్వాస్పత్రిలో దారుణం..ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత
- హైదరాబాద్–విజయవాడ హైవే పై 60 అండర్‌పాస్‌లు
- నితీశ్ రాజకీయాల్లో అరుదైన రికార్డు
- ఎల్బీ స్టేడియంలో అరైవ్ అలైవ్ లాంచ్
- CII సదస్సు తొలిరోజు రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు
- ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!
- ముగిసిన రెడ్ వేవ్ 8 నావల్ డ్రిల్..!!
- దుబాయ్ లో T100 ట్రయాథ్లాన్..ఆర్టీఏ అలెర్ట్..!!
- బహ్రెయిన్ లో దీపావళి మిలన్..!!







