60 రోజుల టూరిస్ట్ వీసాల జారీని పునఃప్రారంభించిన యూఏఈ

- October 10, 2022 , by Maagulf
60 రోజుల టూరిస్ట్ వీసాల జారీని పునఃప్రారంభించిన యూఏఈ

యూఏఈ: 60 రోజుల విజిట్ వీసాల జారీని యూఏఈ పున:ప్రారంభించింది. ఈ మేరకు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్, పోర్ట్ సెక్యూరిటీ (ICP) ఓ ప్రకటనలో తెలిపింది. అక్టోబరు 3 నుండి అమల్లోకి వచ్చిన అడ్వాన్స్‌డ్ వీసా సిస్టమ్ అని పిలువబడే విస్తృత సంస్కరణల్లో ఇది ఒక భాగం అని పేర్కొంది. యూఏఈ అతిపెద్ద రెసిడెన్సీ, ఎంట్రీ పర్మిట్ సంస్కరణల్లో భాగంగా అడ్వాన్స్‌డ్ వీసా సిస్టమ్ ను ప్రవేశపెట్టింది. ఏప్రిల్‌లో యూఏఈ కేబినెట్ ప్రకటించిన వివరాల ప్రకారం..  అన్ని ప్రవేశ వీసాలు వాటి జారీ తేదీ నుండి 60 రోజుల వరకు చెల్లుబాటు అవుతాయి. కొత్త ప్రవేశ అనుమతులలో ఉద్యోగ అన్వేషణ ప్రవేశ వీసా, వ్యాపారం కోసం వచ్చేవారు,  ఐదు సంవత్సరాల బహుళ-ప్రవేశ పర్యాటక వీసా, బంధువులు లేదా స్నేహితులను సందర్శించడానికి,  తాత్కాలిక పని కోసం, చదువులు/శిక్షణ కోసం వచ్చే వారికి వీసాల జారీలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 60 రోజుల విజిట్ వీసా జారీ ప్రారంభమైందని, ఈ వీసా కోసం క్లయింట్ల దగ్గర్నుంచి Dh500 వసూలు చేస్తున్నట్లు స్మార్ట్ ట్రావెల్ మేనేజింగ్ డైరెక్టర్ అఫీ అహ్మద్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com