హయ్యా కార్డ్ హోల్డర్లకు బంపరాఫర్ ప్రకటించిన సౌదీ
- October 12, 2022
జెడ్డా : FIFA ప్రపంచ కప్ ఖతార్ 2022కు హాజరయ్యే అభిమానులకు సౌదీ అరేబియా బంపరాఫర్ ప్రకటించింది. ఫారిన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖలోని ఇ-వీసా సర్వీస్ ప్లాట్‌ఫారమ్‌కు సంబంధించిన - ఫ్యాన్ టిక్కెట్లు (హయ్యా కార్డ్) హోల్డర్ల కోసం సౌదీ అరేబియాకు ప్రవేశ వీసా జారీ చేయడానికి ఇ-సేవల ఖర్చులను భరించడానికి సౌదీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. హయ్యా కార్డ్ (ఫ్యాన్ ఐడి) ద్వారా FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 మ్యాచ్‌లలో దేనికైనా హాజరయ్యేందుకు జారీ చేసే గుర్తింపు పత్రం. ఫిఫా ప్రపంచ కప్ సీజన్‌లో 60 రోజుల వరకు రాజ్యంలో గడిపేందుకు హయా కార్డ్‌ని కలిగి ఉన్న FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 అభిమానులందరికీ సౌదీ అరేబియా స్వాగతం పలుకుతుందని సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ గతంలో ప్రకటించింది. తాజాగా మంగళవారం మధ్యాహ్నం జెడ్డాలోని అల్-సలామ్ ప్యాలెస్‌లో రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో హయ్యా కార్డ్ హోల్డర్లకు సౌదీలో పర్యటించేందుకు అవసరమైన ఇ-వీసాలను ఉచితంగా అందజేసేందుకు సంబంధించిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







